• Now Playing: Veda Pathanam & Gurustuti
Admin : Login
...
Admin : Login
  • Home
  • About Us
    • Organization
    • Master
    • Centers
  • Media
    • News
    • Gallery
    • Video Gallery
    • Events
    • Mobile Apps
    • MEK Community
  • Publications
    • EBooks
    • Books
    • Calendar
  • Lectures
  • Radio E.K
    • About
    • Schedule
image
  • Home
  • About Us
    • About Organization
    • About Master
    • About Center
  • Media
    • News
    • Gallery
    • Video Gallery
    • Events
    • Mobile Apps
    • MEK Community
  • Publications
    • EBooks
    • Books
    • Calendar
  • Lectures
  • Radio E.K
    • About
    • Schedule

Gallery

Homoeo Conference(09-05-2026) - Visakhapatnam
Dr. Hahnemann Birthday Celebrations
Vijayawada Gurupoojas - 2026
Srisailam Gurupoojas - 2026
Nellore Gurupoojas - 2025
Kothagudem Gurupoojas - 2025
Chennai Gurupoojas - 2025
Tenali Gurupoojalu - 2025
Dr. Anantha Acharya Medical Service, Tenali-2025
Ongole Gurupoojas - 2025
Visakhapatnam Gurupoojas - 2025
Kakinada Gurupoojas - 2025
Machilipatnam Gurupoojalu - 2025
Homoeo Vaidyaseva - Srikakulam - 2025
Performing Asanas in Class
Yoga Training Moments Captured
Medical Conference - Visakhapatnam
Vizianagaram Dispensary Anniversary
Vijayawada Gurupoojalu-2025
Bhagavatha Sapthaham-Sukratal
Foreigner's Classes Srisailam - 2025
Guntur Gurupoojalu - 2025
Hyderabad Gurupooja Photos-2024
Bhagavatha Sapthaham Pedamuttevi
Guntur Guru Pooja 2024
Bhagavatha Sapthaham - Naimisharanyam
Khammam Gurupoojalu Photos
Hyderabad Gurupuja-2021
visakhapatnam Gurupoojalu 2021
Guntur Gurupooja 2019-2
Guntur Gurupooja 2019-1
Guntur Gurupooja 2019
Gurupooja Celebrations-13-Jan-2018
Gurupooja Celebrations-12-Jan-2018
Gurupooja Celebrations-11-Jan-2018
EAK Russia-Ukraine photos
EAnanthacharya-RussiaTour-2016
PrayerHall-Inauguration
About Us
  • About Organization
  • About Master
  • About Centers
Media
  • News
  • Gallery
  • Video Gallery
  • Events
  • Mobile Apps
Publications
  • EBooks
  • Books
  • Calendar
Lectures
  • Lectures
Radio E.K
  • About
  • Schedule
Follow Us

Copyright © 2017 Master EK.All rights reserved Privacy Policy & Mobile Privacy Policy

Poweredby New Meksolutions

MasterApp

Jun 25, 2026

Pavan

Copied!
🌷 *June 25,Today's Meditation*🌷
Mark the ark in moon. Sixteen chapters of Mark in sixteen days of sailing in ark. Sixteen moons shine. Maiden wears crown of moons.


🌷 *జూన్ 25, నేటి ధ్యానము*🌷
🌻 నయముగ గుర్తింపుము నావనిందునందు
మార్కు మహర్షి మహిత కవిత షోడశాధ్యాయిని
షోడశ సర్గలె నౌకా ప్రయాణ వ్యవధి షోడశదినాలు
విశ్వసర్గము నందున షోడశతిథులు విరాజిల్లు
షోడశ శశాంకుల సుధాంశువులె శోభనొందు
మాత మహిత కిరీటమ్ము  షోడశ శశి స్నిగ్ధ కళామయము........✍ *మాస్టర్ ఇ.కె.* 🌻

04:46 AM

Jun 24, 2026

Pavan

Copied!
🌸 *శ్రీమద్భాగవతము* 🌸


🌷 *బ్రహ్మాదుల పుట్టుక* 🌷


🌹 స్వాయంభువుడితో కర్థముడు ఇట్లనెను….. సృష్టి, స్థితి లయములకు నారాయణుడే కారణము. బ్రహ్మాదుల పుట్టుకకు అతడే కారణము. కనుక వాని ఆజ్ఞను ఉల్లంఘించరాదు. కర్దముడు ఇట్లు పలుకగా మనువు తన భార్యతోను, పుత్రికతోను సంప్రదించి, వారి అభిప్రాయము తెలిసికొని ముడిపెట్టిననియు అంగీకరించి, సంతోషముతో శాస్త్రోక్తముగా కర్దమునకును దేవహుతికిని వివాహము చేయించెను. 


అప్పుడు శతరూపాదేవి కూతూరునకు అల్లునకు వివాహ జీవితమునకు కావలసిన విలువగల సామాగ్రిని బహుకరించి ఆ బహుమానములకు పారిబర్హము అని పేరు పెట్టెను.(పారిబర్హము అనగా కట్నము)...….✍  *మాస్టర్ ఇ.కె.* 🌹 శ్రీమద్భాగవతము. 3-789,790.

09:38 PM

Jun 24, 2026

Pavan

Image

12:51 PM

Jun 24, 2026

Pavan

Copied!
🥀 *శ్రీ కృష్ణమాచార్య నమస్తుభ్యం*🥀


🥀 *చేస్తే అలా చెయ్యి*🥀


🌻 మాస్టరుగారు ఆ రెండు పుస్తకాలను తెరచి చూసారు. తెరిచి అలా చూస్తూ చూస్తూ ఉండగానే ఆయన చూపులలో తీక్షత పెరగసాగింది. అంతకంతకూ వదనం గంభీరతను దాలుస్తున్నది. ఉత్కంఠతతో చూస్తున్న ఇతనికి ఊపిరి అందటం కష్టంగా ఉంది. ఫ్యాను పైన తిరుగుతున్నా స్వేదం బిందువులు బిందువులుగా అలా పొంగుకొని వస్తూనే ఉన్నది. వదనాన్ని పైకెత్తి సూటిగా అతని కన్నులలోనికి చూస్తూ మాస్టరు గారు ఇలా అన్నారు, 


“ఏమిటీ వని? ఊఁ ఏమిటీపని? చెప్పు ఊఁ ఎవరిని అడిగి చేశావ్? మీతో చెప్పకుండా ఒక చిన్న మంచిపని చేశాను అని నీవు చెప్పినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో చేసి ఉంటావని ఏమిటీ పని? 


మంచి పని అని నీవనుకుంటే సరిపోయిందా? నీకు మంచి పని అనిపించింది. నాకు అనిపించకపోవచ్చు గదా ఏమంటావ్? ఎందుకిలా చేసావ్? ఇలా చేయాలని నీకెందుకు అనిపించింది. చెప్పవేం? ఆఁ చేసిన వాడివి చెప్పవేమయ్యా? ఎందుకు చేశావు ఇది" 


చెమటలు వడుతున్న అతనికి ప్రయత్నించినా గొంతు పెగులుతున్నట్లుగా లేదు. మరింత ప్రయత్నం మీద గొంతును పెగుల్చుకుంటూ 


"క్షమించండి మాస్టారూ! మీ అనుమతిని తీసుకోకుండా ఇలా చేయటం తప్పే ఇందులో వేరే ఉద్దేశం ఏదీ లేదండీ మీ మీద ఉన్న ఆరాధనా భావంతో ఈ పెట్టబోయే వ్యాపార సంస్థకు కూడా మీ పేరే పెట్టుకోవాలని ఉద్దేశపడ్డాను. కాని నేను చేసింది తప్పే. ముందుగా మీతో చెప్పి, మీ అనుమతిని తీసుకొని చేయవలసింది. తప్పు జరిగిపోయింది. దీనికి కారణం ఒక్కటే నేను చేసిన ఈ పని మిమ్మల్ని ఇంతగా నొప్పిస్తుందని నేను ఊహించలేదు" 


కొద్ది నిముషాల పాటు నిశ్శబ్దం అక్కడ ఆవరించింది. బొమ్మలోని ఒక దృశ్యంలా ఆ గది అలా నిలబడి పోయింది. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ, మాస్టరు గారిలా అన్నారు............✍ *మోపిదేవి కృష్ణస్వామి* 🌻M220.


(To be Continued)


( మోపిదేవి కృష్ణస్వామి గారు రచించిన‌ గ్రంథాలలో నుండి)

12:50 PM

Jun 24, 2026

Narayana M

Copied!
https://youtube.com/shorts/9gN5wPeoHck?si=J7KsXSfzWzlnEl0k

10:17 AM

Jun 24, 2026

Narayana M

Copied!
https://youtube.com/shorts/7tT8DxD5Jt0?si=au22R8XdW5nWwwds

10:16 AM

Jun 24, 2026

Anantakrishna E

Copied!
You think that gods are great. Poor fellows, even they do not remember Me at times. They do not know My birth, because they are born from Me and I was there already when they were born. Every day when you wake up from sleep, you find your awakening consciousness already present by that time. This only the gods know Me. Even the seers cannot know My beginning because I AM already their sight before they begin to see. Thus you know I AM the beginning of the gods and the seers.
Mandra Scripture.  10-2.
Master EK.

06:41 AM

Jun 24, 2026

Pavan

Copied!
🌷 *June 24, Today's Meditation*🌷
Ocean roars thunder. Waves meet clouds. Ark leaps on bounds. Whole space sounds. Foam of ocean abounds. OM resounds.


🌷 *జూన్ 24, నేటి ధ్యానము* 🌷
🌻 పయోధి గర్జాగోషయె పిడుగుపాటు
సాగర భంగాలు నింగికెగసి కారు మొయుళ్ళను కలియుచుండె
పడవ పదపదయని పరువులిడసాగె
నభోంతరమెల్ల నినందించిపాడె
సాగరఫేన మవధులు దాటి అతిశయించె
ప్రణవనాదలహరి 'ఓం' 'ఓం' యనుచు ప్రతిధ్వనించె..........✍ *మాస్టర్ ఇ.కె.*🌻

05:19 AM

Jun 23, 2026

Pavan

Copied!
🌸 *శ్రీమద్భాగవతము* 🌸


🌷 *బ్రహ్మాదుల పుట్టుక* 🌷


🌹 ఈ తొలి మానవజాతికి దేవత్వము, నరత్వము కూడా కలదు. అందుచే దేహధారణము, దేహము విడుచుట సంకల్ప మాత్రములు. అవి పెద్ద సంఘటనలు కావు. కనుక బ్రహ్మచర్యాశ్రమమున దేహము అక్కరలేదు. అట్లే సన్యసించిన వెనుకను దేహము అక్కరలేదు.  గృహస్థాశ్రమము స్వీకరించుటలో భౌతిక దేహము ధరింపబడును. సన్యసించుటతో అది విడువబడును. 


కర్దముడు సంతతి కలిగిన వెనుక సన్యసింతునని తెలుపుట అనగా తన దేవకార్యము నిర్వర్తించిన పిమ్మట వెంటనే భౌతిక శరీరమును విడిచెదనని చెప్పుట‌. ఇచ్చట మమకారమునకు తావు లేకుండుటకై ముందు చెప్పుచున్నాడు. 


తరువాత కాలమున మానవులు కర్దముని మార్గము అనుసరింపక, బురదలో దిగబడిరి. అనగా భౌతిక దేహముపై వ్యామోహము‌ పెంచుకొని ముసలితనమున గూడ శిథిల శరీరములతో వ్యామోహులై మలశకటముల వలె చరించుటకు ఇష్టపడిరి. అప్పటి నుండియే భూమిపైన జనసంఖ్య పెరుగుటయు, అది ఒక సమస్య అగుటయు ప్రారంభమైనది. 


దీనిని గూర్చిన వివరములు జ్వాల్ కూల్ మహర్షి ప్రవచనము చేసిన “ESOTERIC HEALING” అను గ్రంథమున “The Art of Dying”అను శీర్షికలో చూడవచ్చు.…….✍  *మాస్టర్ ఇ.కె.* 🌹 శ్రీమద్భాగవతము. 3-788.

09:20 PM

Jun 23, 2026

Anantakrishna E

Copied!
Let our logic not condition our existence.
That we think in you our thoughts.
Let our likes not condition our living.
That we think like everything in you.
You think for us through us,
That you live in us through us.
You choose for us what is for us.
You make us know what is good to us.
You shower on us the choicest of your blessings.
Keep us off from choosing for us.
Keep us off from liking for us.
You be our liking and choice and thought.
Oh! Lord lead us into your own existence.
Master EK.

05:33 PM

Jun 23, 2026

Pavan

Image

12:30 PM

Jun 23, 2026

Pavan

Copied!
🥀 *శ్రీ కృష్ణమాచార్య నమస్తుభ్యం*🥀


🥀 *చేస్తే అలా చెయ్యి*🥀


🌻 ఒక చేతిలో రసీదు పుస్తకాల కట్ట, మరొక చేతిలో లెటర్ హెడ్ ప్యాడ్స్ కట్ట పట్టుకొని ఒక నలభై ఏళ్ళ నడివయస్కుడు మాస్టరు గారి గదిలోనికి ప్రవేశించాడు. అలా ఆ కట్టలు పట్టుకునే చేతులు జోడించే ప్రయత్నం చేస్తూ, “నమస్కారం మాస్టరు గారూ! అని కట్టలు క్రిందపెట్టి నిలబడ్డ అతనిని చూపులతోనే కూర్చోవలసిందిగా సూచించారు మాస్టరు గారు. కొద్ది క్షణాల తరువాత తానప్పటికి చేస్తున్న పనిని కొంచెం ప్రక్కగా పెట్టి. 


"ఏమిటోయ్ ఇలా వచ్చావ్? ఈ పుస్తకాల కట్టలూ అవీ ఏమిటోయ్? అని అడిగారు. 


తిరిగి చేతులు జోడిస్తూ తాను కూర్చున్న ఆసనాన్ని మాస్టరు గారికి దగ్గరగా జరుపుకొని, వినమ్రంగా కూర్చొంటూ, 


“మాస్టరు గారూ మీకు చెప్పకుండా ఒక చిన్న మంచిపని చేసానండీ? అందుకు మీ ఆశీస్సులు కావాలి" అన్నాడతను. అంటూనే పాదాల చెంతకు వంగాడు. చేతులతో మాస్టరు గారి పాదాలను స్పృశించి కన్నులకు అద్దుకుంటున్నాడు. ఆ పుస్తకాల కట్టలను కూడా ఆ పాదాలకు తాకించే ప్రయత్నం చేస్తున్నాడు. కట్టలతో సహా అతణ్ణి అలా ఆపి, అలా చేయడం కట్టిపెట్టమని కన్నులతోనే వారిస్తూ, 


“ఇంతకీ ఈ హడావిడేమిటో చెప్పు మహానుభావా నువు కంగారు పడిపోతున్నావ్. నన్ను కంగారు పెట్టాలని చూస్తున్నావ్. కూర్చో, అలా ప్రశాంతంగా కూర్చొని సంగతేమిటో చెప్పు”. 


“ఏం లేదు మాస్టరు గారూ మీ అనుమతి తీసుకోకుండా ఒక చిన్న పని చేసాను. నా మీద ప్రేమతో మీరు ఆ పనిని అనుమతించి, ఆశీర్వదించాలి" అంటూ అతను రశీదుల పుస్తకం ఒకటీ, లెటర్ హెడ్ ప్యాడ్ ఒకటీ, మాస్టరు గారి చేతిలో పెట్టాడు. పెట్టి ఉత్కంఠతతో మాస్టరు గారి వైపు అలా చూస్తూ ఉండిపోయాడు.......✍ *మోపిదేవి కృష్ణస్వామి* 🌻M219.


(To be Continued)


( మోపిదేవి కృష్ణస్వామి గారు రచించిన‌ గ్రంథాలలో నుండి)

12:30 PM

Jun 23, 2026

Narayana M

Copied!
https://youtube.com/shorts/4x4kZxi6hSw?si=BRxmczbtlPBzjOf4

09:47 AM

Jun 23, 2026

Narayana M

Copied!
https://youtube.com/shorts/hFRSQMvBRfM?si=yrN24i8RNk-2mN7q

09:46 AM

Jun 23, 2026

Pavan

Copied!
🌷 *June 23,Today's Meditation*🌷
Three days before initiation. Ninety two days in ninety degrees. Ninety third day of judgement. The rod of justice rules. Ark reaches shore. Bird chirps future. Past doubled future. Past meets future in man.


🌷 *జూన్ 23,నేటి ధ్యానము* 🌷
🌻 మూడుదినాలింక ముగిసినగాని
పరమ దివ్యోపదేశము ప్రసాదితముగాదు.
తొంబది డిగ్రీలలోన తొంబదిరెండు దినాలుగడువ
తొంబది మూడవ దివసాన
తీర్పు నిర్ణీతమై తెలుపబడుగాదె.
న్యాయదండమ్ము సర్వాతిశాయియై
నయమును పాలించు నీమముగను,
నౌక చేరును నదీపతి తీరమును.
పిట్టపలుకును భావిని ఘనస్వనమున.
గతము ద్విగుణమయ్యెను భావిగాను.
భూత భవితవ్యాలసంగమస్థానము,
భవ్యముగ మానవుడై మనునుగాదె.........✍ *మాస్టర్ ఇ.కె.* 🌻

05:35 AM

Jun 22, 2026

Pavan

Image

12:01 PM

Jun 22, 2026

Pavan

Copied!
🥀 *శ్రీ కృష్ణమాచార్య నమస్తుభ్యం*🥀


🥀 *పచ్చికాస్తా పండాలి*🥀


🌻 ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకో. నువ్వు వాళ్ళతో వాదిస్తున్నావా? వాళ్ళకు తెలియ జెప్పుతున్నావా? ద్వేషభావం ఉన్నప్పుడు వాదిస్తాం. ప్రేమతత్వం నిండినపుడు తెలియజెపుతాం. కనుక మనలో ఆ కాస్త పచ్చి కూడా పండవలసి ఉంది. పండిననాడు వాళ్లెవరూ నీపైన తిరగబడరు. వస్తే నీ వెంట వస్తారు, లేదా వాళ్ళకు నచ్చినట్లుంటారు. నిన్ను ద్వేషించరు. 


ఒకరి సిద్దాంతం మనకు నచ్చనంత మాత్రం చేత మనం వారిని ద్వేషించనక్కరలేదు. ఈ సత్యాన్ని ముందు మనం గమనించి అమలుపరచాలి. అప్పుడు క్రమంగా అవతలివాళ్ళు కూడా అమలుపరుస్తారు. సిద్దాంతంతో నిమిత్తం లేకుండా, ఒకరినొకరు ప్రేమించుకోవటమనేది, గౌరవించుకోవటమనేది అప్పుడు జరుగుతుంది. ఇక రావలసిన మేలుకొలుపు అంటావా? కాలక్రమంలో అదే వస్తుంది. మనలో ఎలా వచ్చింది? వాళ్ళలోనూ అలాగే వస్తుంది. 


మన స్నేహ హస్తాన్ని వారికి అందించి, వారిలో రావలసిన మేలుకొలుపుకు దోహదం చేయాలి. తప్ప, వాదించి ఏం లాభం? ఆ దోహదం కూడా సహజంగా ఉండాలి. జరుగుతున్నట్లు వారికి తెలియనక్కరలేదు. మండుతున్న కట్టెపేడుతో, మండవలసిన కట్టెపేడు చేరినప్పుడు ఏం జరుగుతుంది? అలా ఉండాలి. ఈ నా మాటలు నీకు బోధపడ్డాయి అనుకుంటాను. ఈ చిన్న మార్పు నీలో వస్తేచాలు. ఇక కథ దారికి వస్తుంది. ఏమంటావ్?" 


మాస్టరుగారు సూటిగా చూస్తున్నారు. ఆ చూపులు ఎంత సూటిగా ఉన్నాయో అంత హాయిగా కూడా ఉన్నాయి. అతని మనస్సులో మిగిలిన ఆ కొద్ది ద్వేషాన్ని కరిగించి, ప్రేమగా రూపొందిస్తునట్లున్నాయి. గొంగళి పురుగు సీతాకోకచిలుకగా రూపొందుతున్న వేళ, ఆ ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లుగా ఉన్నాయి. 


"అర్థమైంది నాకర్థమైంది. నాకు కావలసిన జవాబు దొరికింది. ఇక ఈ జీవితం దారిన పడుతుంది. ఇంతవరకూ నచ్చిన దానిని ప్రేమించాను నేను. ప్రేమగలవాడికి నచ్చనిదంటూ ఏమీ ఉండదని ఇప్పుడు తెలుసుకున్నాను. తోటి వ్యక్తులను మనలోని ప్రేమ పొదుగుతుంది. మనలోని ద్వేషం రెచ్చగొడుతుంది. ఇప్పుడు నాకర్థమైంది. నాకు హాయిగా ఉంది. బరువు దిగిపోయినట్లుంది. మనస్సుతో పాటు శరీరం కూడా తేలికపడింది. ఒకానొక హాయి నన్ను ముంచెత్తుతోంది. 


ఆహా! ప్రేమ ఎంత హాయిగా ఉంటుంది. ఆ హాయిని మనలో వెలిగించే సన్నిధి ఇంకెంత హాయిగా ఉంటుంది. ఇదిగో ఇంత హాయిగా ఉంటుంది." అనుకొంటూ అతడు మాస్టరు గారి పాదాలపై వాలిపోయాడు.........✍ *మోపిదేవి కృష్ణస్వామి* 🌻M218.


(To be Continued)


( మోపిదేవి కృష్ణస్వామి గారు రచించిన‌ గ్రంథాలలో నుండి)

12:00 PM

Jun 22, 2026

Narayana M

Copied!
https://youtube.com/shorts/vVAQ7cvxR0g?si=7bsDsaJ9KOZe5Pwb

09:20 AM

Jun 22, 2026

Pavan

Copied!
🌷 *June 22, Today's Meditation*🌷
Man reaches shore. Sailor transformed hunter. The Lion, the Bull, the Serpent, the Maid, the Lotus, safely landed. Fish goes to sea. Eagle flies into the sky. Man comes to land to rule. Rod of justice established. Thunder wonder trumpet. The wheel reverses.


🌷 *జూన్ 22,  నేటి ధ్యానము* 🌷
🌻 మానవుడు చేరాడు తీరాన్ని.
నావికుడు మారురూపొందాడు మృగయుడుగ.
నేరుపుగా, క్షేమంగా నిలిచాయి నేలపై,
సింహ వృషభాలును, సర్పంబు, కన్యయు, కమలమ్ము .
జలజాతమౌ మీనమ్ము సొచ్చె జలనిధిలోనికి.
గృద్రమెగిరెను గగనాంతరమ్మునకు,
నేలకరుదెంచె నరుడేలగాను.
నెలకొల్పబడె నెరన్యాయదండమ్ము .
మేఘదుందుభి నిర్ఘోష నిస్వనమునకు నివ్వెరజెందె కంచుఢక్క
చక్ర భ్రమణమ్ము వ్యుత్ర్కమ సరణినందె........✍  *మాస్టర్ ఇ.కె.* 🌻

06:50 AM

Jun 22, 2026

Anantakrishna E

Copied!
Doing is lively, done is death. Those who have done have died. Those who are doing are ever-living. Continuing in doing is present.
Mandra Scripture.
Master EK.

05:54 AM

Jun 21, 2026

Pavan

Copied!
🌸 *శ్రీమద్భాగవతము* 🌸


🌷 *బ్రహ్మాదుల పుట్టుక* 🌷


🌹 స్వాయంభువుడితో కర్థముడు ఇట్లనెను….. ఈ కన్యా రత్నమునకును, నాకును గుణమునందు, రూపమునందు, ప్రవర్తనమందు, సామ్యము కనుపించినది. కనుక నేను ఈమెను నిర్మల మనస్సుతో వరింతును. 


కాని దీనికొక నియమమును ఏర్పరచుకొంటిని. ఈమెకు సంతానము కలుగు వరకు మాత్రమే నేను గృహస్థ ధర్మమున ఉందును. అటు మీద శమదమాది గుణములతో యోగభ్యాసము చేసి సన్యసించెదను. ఇది నారాయణుని ఆజ్ఞ.…….✍  *మాస్టర్ ఇ.కె.* 🌹 శ్రీమద్భాగవతము. 3-786,787,788.

07:47 PM

Jun 21, 2026

Pavan

Image

01:19 PM

Jun 21, 2026

Pavan

Copied!
🥀 *శ్రీ కృష్ణమాచార్య నమస్తుభ్యం*🥀


🥀 *పచ్చికాస్తా పండాలి*🥀


🌻 నోరు మూయించే శక్తిగల వ్యక్తి ఒకాయన ఉన్నాడని తెలిసింది. స్నేహితుల ప్రోద్భలంతో అతణ్ణి రంగంలోనికి దింపాను. అతడు ఉద్దండుడై విజృంభించారు. అతడి ఉపన్యానాలు జరిగినంతకాలం ఆ నాస్తిక సమూహం వచ్చారు కాని, ఎవ్వరూ  కిక్కురుమనలేదు. కొంతవరకు సంతోషమైంది. సరే ఆ ఉపన్యాసకుడికి ముట్టచెప్పగలిగినంత ముట్టచెప్పి సాగనంపాను. అతడు వెళ్ళిన మరునాడే మళ్ళీ వచ్చారు వాళ్ళు. 


"మేము వాదించదలచుకున్నది ఆయనతో కాదండీ! మీతోనే" అన్నారు. అందుకనే మేము ఆయనతో ఘర్షణ పడలేదు. అన్నారు. కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఎందుకు వాళ్ళిలా ప్రవర్తిస్తున్నారు? ఒక రకంగా వాళ్ళు నన్ను వేధిస్తున్నారు. నేను చేసిందేమిటి? ఇది మంచి అని చెప్పాను. తెలుసుకుని బాగుపడండి, అన్నాను. వాళ్లు ఎందుకని గ్రహించలేకపోతున్నారు. ఏం చేయాలో నాకు పాలుపోవటం లేదు. ఎందుకని ఇలా జరుగుతోంది?" ఆయన ముఖంలో ప్రశ్నార్థకం గోచరిస్తోంది. 


ప్రశాంతవదనులై కూర్చున్న మాస్టరుగారి వైపు సమాధానం కోసం చూస్తున్నారు ఆయన. "సమాధానపరిచే సమాధానం వచ్చే చోటు ఇదీ" అని ఆయనకు తెలుసు. అందుకనే తన మనస్సులోనిది అ‌ంతా మాస్టరుగారి ముందు వెళ్ళ బోసుకున్నారు. 


చిరునవ్వు నవ్వుతూ మాస్టరు గారిలా అన్నారు. "అడిగావు కాబట్టి చెబుతున్నాను. ఏమీ అనుకోవు కదూ! నీలో ఇంకా కొంత అవగాహన రావలసింది ఉంది. అదేమింటంటే నాస్తికులు అంటే నీ మనస్సులో కొంత "ఎవర్షన్" ఉంది. ఆ గిట్టని తనం ఉండటంతో వాళ్ళు నీ మీద సవాళ్లు చేయడం జరుగుతోంది. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకో. నువ్వు వాళ్ళతో వాదిస్తున్నావా? వాళ్ళకు తెలియజెపుతున్నావా? ద్వేషభావం ఉన్నప్పుడు వాదిస్తాం. ప్రేమతత్వం నిండినపుడు తెలియజెపుతాం."..........✍ *మోపిదేవి కృష్ణస్వామి* 🌻M217.


(To be Continued)


( మోపిదేవి కృష్ణస్వామి గారు రచించిన‌ గ్రంథాలలో నుండి)

01:19 PM

Jun 21, 2026

Narayana M

Copied!
https://youtube.com/shorts/8JROu9CTTqU?si=W5zkeLnVX3GpCiZc

09:49 AM

Jun 21, 2026

Pavan

Copied!
♋ CANCER
Feeling - Sensation - Sentiment
Imagine - Image - Conceive
Emotion - Inspiration - Devotion.

09:42 AM

Jun 21, 2026

Pavan

Image

09:41 AM

Jun 21, 2026

Pavan

Image

09:41 AM

Jun 21, 2026

Pavan

Copied!
🌷 *June 21,Today's Meditation*🌷
Man reaches shore. Sailor transformed hunter. The Lion, the Bull, the Serpent, the Maid, the Lotus, safely landed. Fish goes to sea. Eagle flies into the sky. Man comes to land to rule. Rod of justice established. Thunder wonder trumpet. The wheel reverses.


🌷 *జూన్ 21, నేటి ధ్యానము*🌷
🌻 మానవుడు చేరాడు తీరాన్ని.
నావికుడు మారురూపొందాడు మృగయుడుగ.
నేరుపుగా, క్షేమంగా నిలిచాయి నేలపై,
సింహ వృషభాలును, సర్పంబు, కన్యయు, కమలమ్ము.
జలజాతమౌ మీనమ్ము సొచ్చె జలనిధిలోనికి.
గృద్రమెగిరెను గగనాంతరమ్మునకు,
నేలకరుదెంచె నరుడేలగాను.
నెలకొల్పబడె నెరన్యాయదండమ్ము.
మేఘదుందుభి నిర్ఘోష నిస్వనమునకు నివ్వెరజెందె కంచుఢక్క
చక్ర భ్రమణమ్ము వ్యుత్ర్కమ సరణినందె........✍ *మాస్టర్ ఇ.కె.*🌻

06:05 AM

Jun 21, 2026

Anantakrishna E

Copied!
May I be your mind. May I be your devotion, your worship and your salutation. Like this you Link up with Me. Have Me as your all, you come to Me. 
Mandra Scripture.  9-34.
Master EK.

05:54 AM

Jun 20, 2026

Pavan

Copied!
🌸 *శ్రీమద్భాగవతము* 🌸


🌷 *బ్రహ్మాదుల పుట్టుక* 🌷


🌹విశ్వావసుడు గంధర్వుడు వివాహమునకు అధిదేవతగా శాస్త్రముల యందు వర్ణింపబడెను. ఏ కన్యనైనను అతడు మొదట వరించి భూమిపై పడిన వెనుక భర్త కాబోవు వాడు వరించునని వేద మంత్రములు చెప్పుచున్నవి. 


విశ్వావసువు అనగా సర్వపురుషుల సంపద అగు యౌవన మధుర భావము. అతడు వరింపనిదే కన్యను ఎవ్వరును వరింపలేరు......✍  *మాస్టర్ ఇ.కె.* 🌹 శ్రీమద్భాగవతము. 3-784.

07:20 PM

Jun 20, 2026

Narayana M

Copied!
https://youtube.com/shorts/bLLwwUvinMk?si=nFeLh7RvsVrd9EJs

12:49 PM

Jun 20, 2026

Pavan

Image

12:18 PM

Jun 20, 2026

Pavan

Copied!
🥀 *శ్రీ కృష్ణమాచార్య నమస్తుభ్యం*🥀


🥀 *పచ్చికాస్తా పండాలి*🥀


🌻 అది చిన వాల్తేరు కాలనీలోని మాస్టరు గారి ఇల్లు. రాత్రి పదిగంటలు దాటుతోంది. పనులన్నీ చూసుకునివచ్చిన మాస్టరుగారు, అప్పుడే మంచం మీద కూర్చుని ప్రక్కనున్న వారితో సరసోక్తులాడుతున్నారు. ముందు గదిలో కూర్చున్న సన్నిహితులొకరు మెల్లగా మాస్టరు గారి చెంతకు చేరుకున్నారు, ఆయన మాస్టరు గారికి చాల దగ్గరవారు. అన్ని విధాల దగ్గరవారు. 


"మధ్యాహ్నం కొంత చెప్పాను గదా! అదే వాళ్ళ సంగతి వాళ్ళు ఎందుకలా ప్రవర్తిస్తున్నారో నాకు అంతుపట్టడంలేదు. నేనేం చేసాను? వాళ్ళు నమ్ముతున్న సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా విశ్లేషించాను. ఆ సిద్ధాంతానికి పునాదులూ లేవు. గమ్యమూ లేదని నిరూపించాను. ఇదంతా వాళ్ళకు అర్థం కావాలనే చేశాను. అర్థం చేసుకోవలసింది పోయి వాళ్ళెందుకలా వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. Almost వాళ్ళు నాకు శత్రువులుగానే ప్రవర్తిస్తున్నారు. 


కావాలని వస్తారు, నా దగ్గరకు ఏదో మాటలు మొదలు పెడతారు. మధ్యలో అనుభూతుల ప్రసక్తి వస్తుంది. నేను పొందిన అనుభూతులు వాళ్ళకు చెబుతాను. వాళ్ళు నమ్మరే? పైగా ఆ అనుభూతులు వాళ్ళకు చూపించమంటారు అదెలా సాధ్యం? అవి ఎవరికి వారు పొందవలసినవి కదా, ఈ మార్గాన కృషి చేయండీ, మీరూ పొందుతారు అంటాను. 


అదంతా మాకు అనవసరం. మీకు కలిగాయి అంటున్నారు. కాబట్టి మాకూ చూపించండి. లేకపోతే మేం నమ్మం. అంటారు వాళ్ళు. వితండవాదులకు చెప్పగలిగిన వాళ్లెవరు? వితండవాదులకు దండిగా జవాబులు చెప్పి, మొండిగా ఎదురు తిరిగి ఎక్కడెక్కడి అంశాలో పట్టుకొచ్చి, వాళ్ళను అక్కడికక్కడే నోరు మూయించే శక్తిగల వ్యక్తి ఒకాయన ఉన్నాడని తెలిసింది. స్నేహితుల ప్రోద్భలంతో అతణ్ణి రంగంలోనికి దింపాను. అతడు ఉద్దండుడై విజృంభించారు. అతడి ఉపన్యానాలు జరిగినంతకాలం ఆ నాస్తిక సమూహం...........✍ *మోపిదేవి కృష్ణస్వామి* 🌻M216


(To be Continued)


( మోపిదేవి కృష్ణస్వామి గారు రచించిన‌ గ్రంథాలలో నుండి)

12:14 PM

Jun 20, 2026

Pavan

Copied!
Vaasudeva

12:06 PM

Jun 20, 2026

Pavan

Copied!
vaasudeva

12:05 PM

Jun 20, 2026

Pavan

Copied!
వాసుదేవ

09:18 AM

Jun 20, 2026

Anantakrishna E

Copied!
Even the born. sinners attain the highest perfection by taking refuge in Me, let it be men, women, labourers and utilitarians.


Then what to speak of the liberation of the wise, the pious, the devoted and the administrative? This word without Me is fleeting and devoid of happiness. Live here, but be in Me by worshipping Me.
Mandra Scripture.  9-31,32.
Master EK.

05:57 AM

Jun 20, 2026

Pavan

Copied!
🌷 *June 20,Today's Meditation*🌷
Three days before initiation. Ninety two days in ninety degrees. Ninety third day of judgement. The rod of justice rules. Ark reaches shore. Bird chirps future. Past doubled future. Past meets future in man.


🌷 *జూన్ 20, నేటి ధ్యానము* 🌷
🌻 మూడుదినాలింక ముగిసినగాని
పరమ దివ్యోపదేశము ప్రసాదితముగాదు.
తొంబది డిగ్రీలలోన తొంబదిరెండు దినాలుగడువ
తొంబది మూడవ దివసాన
తీర్పు నిర్ణీతమై తెలుపబడుగాదె.
న్యాయదండమ్ము సర్వాతిశాయియై
నయమును పాలించు నీమముగను,
నౌక చేరును నదీపతి తీరమును.
పిట్టపలుకును భావిని ఘనస్వనమున.
గతము ద్విగుణమయ్యెను భావిగాను.
భూత భవితవ్యాలసంగమస్థానము,
భవ్యముగ మానవుడై మనునుగాదె.........✍ *మాస్టర్ ఇ.కె.*🌻

05:40 AM

Jun 19, 2026

Pavan

Copied!
🌸 *శ్రీమద్భాగవతము* 🌸


🌷 *బ్రహ్మాదుల పుట్టుక* 🌷


🌹 స్వాయంభువుడితో కర్థముడు ఇట్లనెను… "నీ నుండి ఈ కన్య సాటిలేని దాన స్వరూపముగా సంక్రమించుచున్నది. ఈమె రూపురేఖలు, విలాసములు పవిత్రమైనవి. ఈమె లక్ష్మీదేవితో సాటియైన పవిత్రత గలది. 


పూర్వమొక నాటి రాత్రియందు వెన్నెల కాయుచుండగా ఈమె నీ సౌధమునుందు పై భాగమున బంగారు కాలి అందెలతో చెలికత్తెలతో గూడి చరించుచుండెను. బంతి ఆట ఆడుచున్న ఈమెను విశ్వావసువు అను గంధర్వుడు విమానము నుండి చూచెను. మోహము చెందెను. తత్ఫలితముగా భూమి మీద పడెను. 


విష్ణుమూర్తి తత్త్వమెరుగని నరపశువులు ఈమె వంక తేరిపార చూడలేరు. అట్టి కన్య తనంతట తాను వరించి వచ్చిన అదృష్టము కలుగగా కాదనువాడు ఉండునా?.…….✍  *మాస్టర్ ఇ.కె.* 🌹 శ్రీమద్భాగవతము. 3-784,785.

08:18 PM

Jun 19, 2026

Narayana M

Copied!
https://youtu.be/N7sp-sKb7Aw?si=igoC3WicumjdIq4v

07:33 PM

Jun 19, 2026

Anantakrishna E

Copied!
May we remember you as I AM in us ! 
May we remember you in ignorance,
That ignorance is filled with Presence.
May we see you in weakness,
That weakness is filled with You.
May we recollect You in wickedness,
That wickedness is filled with You.
May we know You in sorrow,
That sorrow is filled with you.
May we think of You in want ,
That our want is filled by You.
May we learn to see as life within and around, 
The sum total of which is the "I AM" of You.
Master EK.



05:50 PM

Jun 19, 2026

Pavan

Image

12:21 PM

Jun 19, 2026

Pavan

Copied!
🥀 *శ్రీ కృష్ణమాచార్య నమస్తుభ్యం*🥀


🥀 *అతడూ-ఆయన*🥀


🌻 "ఇదిగో దైవం ఈ సీ.వి.వి. గారి రూపంలో నాకు సాక్షాత్కరించాడు నాకు కావలసినవన్నీ ఈ ఫోటో వెనకు నుండి వచ్చేస్తుంటాయి. ఇది నా అనుభవం. వందలు అవసరమైన రోజున వందలు వస్తాయి. వేలు అవసరమైన రోజున వేలు వస్తాయి. అవసరానికి తగినట్లుగా అవి అమరుతూ ఉంటాయి. అవసరముంటేనే వస్తాయి. అవి రాలేదూ అంటే అవసరం లేదని అర్ధం. అవసరాన్ని బట్టి వస్తాయి. మన కోరికను బట్టి మాత్రం రావు. 


అసలు కోరికలు కరిగిపోయిన వాళ్ళకే అవసరాలంటే ఏమిటో తెలుస్తాయి. చాలా సార్లు మనం కోరికలనే అవసరాలని అనుకుంటూ ఉంటాం. నేను చెప్పినట్లుగా సాధన సాగినపుడు కోరికలు కరిగిపోతాయి. అవసరాలు తీరిపోతాయి. నీకేది కావాలో నీవు గమనించే లోపలే అది నీ దగ్గరకు చేరుకుంటుంది. ఇది ఈ జీవితానుభవం. ఈ జీవిత సందేశం. 


ఇంక చాలుననుకుంటాను నీకు కావలసింది నా నుండి లభించింది. అనుకుంటాను. ఈ ప్రశాంతత క్రమంగా నిన్ను నిలబెట్టగలదు. ఆ ప్రశాంతతలో స్థిరపడు. త్వరపడటం కాదు స్థిరపడటం కావాలి. అప్పుడు నీకేం కావాలన్నది నీవు చెప్పవలసింది కాదు. అది దైవం నిర్ణయించవలసింది. మళ్ళీ కలుసుకుందాం. నేను వెళ్ళిరానా మరి?" అని అంటూ, అంటూనే లేచి నిలబడిన మాస్టరు గారి పాదాలపై అతడు అప్రయత్నంగా మోకరిల్లాడు. 


ఆ పాదాన్ని తనకు కావలసిన పథం చూపవలసిందిగా, తనను నడపవలసిందిగా అర్థిస్తున్నట్లుగా ఉన్నది ఆ నమస్కారం. అనుభూతి బాష్పాలతో పాదాలను కడుగుతున్న అతన్ని చేతులతో పట్టిలేపి అక్కున చేర్చుకున్నారు మాస్టరుగారు. అతడు ఆయనలో అలా ఒదిగిపోయాడు......✍ *మోపిదేవి కృష్ణస్వామి* 🌻M215.


(To be Continued)


( మోపిదేవి కృష్ణస్వామి గారు రచించిన‌ గ్రంథాలలో నుండి)

12:20 PM

Jun 19, 2026

Narayana M

Copied!
https://youtube.com/shorts/2LBgFfb0Lmc?si=HpPU-NvCjjFMspur

10:35 AM

Jun 19, 2026

Pavan

Copied!
వాసుదేవ

09:09 AM

Jun 18, 2026

Pavan

Image

12:13 PM

Jun 18, 2026

Pavan

Copied!
🥀 *శ్రీ కృష్ణమాచార్య నమస్తుభ్యం*🥀


🥀 *అతడూ-ఆయన*🥀


🌻 "నేను దైవము అని అనుకొన్నప్పుడు అది అహంకారం, నేను దైవము అన్న స్థితి అనుభవానికి వచ్చినపుడు అది ఆత్మ దర్శనం. అనుకొనే స్థితినుండి అనుభవించే స్థితికి ఎలా ప్రయాణం చేయాలన్నదే ఇంతవరకూ నేను చెప్పింది." 


“మిమ్మల్ని చూస్తుంటే చిత్రంగా ఉంది. ఇంత సూటిగా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు"! అన్నాడతను అబ్బురపడుతూ. 


“సూటిగా చూస్తున్నాను గనుక” అన్నారు మాస్టరుగారు, అతనిని చూపులతో తడుపుతూ. 


“ఇంకొక్కమాట అడగనా” అన్నాడతను" 


"ఇన్ని అడిగినవాడికి ఆ సంకోచమెందుకు? అడుగు?" అన్నారు మాస్టరుగారు. 


"మీరు చెప్పిన సాధనా విధానానికి, సమన్యయానికి నా జోహార్లు దానికి ఇక తిరుగులేదు. ఇప్పుడు నేనడగబోతున్నది మీరింత పెద్ద వ్యవహారం పెట్టుకున్నారు కదా! లౌకికంగా, ఆర్థికంగా దీనినంతా ఎలా సంబాళిస్తున్నారని. దర్శనంతో పాటు ఎంత ఒడుపు ఉంటే ఈ కార్యక్రమం నడుస్తుంది?" 


కుర్చీలో వెనక్కివాలుతూ మాస్టరుగారు ఇలా అన్నారు. 


"నేను చెప్పిన సాధన సత్కర్మాచరణ రూపంగా సాగినపుడు వనరులకై వెతుకులాడవలసిన పని ఉండదు. వాటికవిగా నడిచివచ్చి మనను చేరుకుంటాయి. ఎవరైనా దీనిని అవలంబించి చూడవచ్చును. లోకానికి కావలసిన పని మన నుండి జరుగుతున్నప్పుడు మన కొరకుగాని, మన నుండి జరుగుతున్న కార్యక్రమం కొరకు గాని, వనరులకై దేవులాడవలసిన పని ఉండదు. ఇది నా అనుభవం. 


ఇదిగో దైవం ఈ సీ.వి.వి. గారి రూపంలో నాకు సాక్షాత్కరించాడు నాకు కావలసినవన్నీ ఈ ఫోటో వెనకునుండి వచ్చేస్తుంటాయి.".....✍ *మోపిదేవి కృష్ణస్వామి* 🌻M214


(To be Continued)


( మోపిదేవి కృష్ణస్వామి గారు రచించిన‌ గ్రంథాలలో నుండి)

12:12 PM

Jun 18, 2026

Narayana M

Copied!
https://youtube.com/shorts/KY0LhznV4k8?si=k2_5XO-Wm4-iPbXx

10:50 AM

Jun 18, 2026

Anantakrishna E

Copied!
I AM equal to all beings. There is no one for Me to dislike or favour. I AM to anyone as he is to Me. If you worship Me in devotion, you are in Me and I Am in you.


Even if the ill-behaved one thinks of Me and worships Me as no second thing, he grows well-behaved. His culmination is perfection.
Mandra Scripture.  9-29,30.
Master EK.

05:56 AM