Copied!
🌷 *April 5,Today's Meditation*🌷
Moon is sliver, I AM the lake. Lake is moonlight, I AM healed. I AM sliver. In me the moonbeam awakes. I AM moonlight, in me the Sun is sealed
🌷 *ఏప్రిల్ 5, నేటి ధ్యానము*🌷
🌻 రాత్రిన వెన్నెలీను రమ్యశశి, రజతమూర్తి
"నేనే" ఒక సరోవరమ్మును
నింగిలోన రసమూర్తిగా నిలిచితిని "నేను"
"నా" లోన నెలకొన్న రసభావమొకటి
రజతమూర్తియై రాజిల్లు గాదె.
శరదిందు శుద్దజ్యోత్స్నయె సరము.
రసభావరాగరంజితము,
రాకా నిశాకరుని రమణమౌ వెన్నెలయె సరము,
నా మానస సరోవరమె
నెలవంక వెన్నెలై జగమెల్ల విరిసె.
దయాసుధామయూఖాల, దైన్యమ్ము దూరమయ్యె
దివ్యుండనేనయితి,సరగున స్వస్దుండనేనయితి,
రజితమూర్తినై నే రాజిల్లుచుంటి.
జాబిల్లి వెన్నెల కిరణాలు జాగృతమైనవి నాలోన
విధుని వెన్నెలనె నేనై వెల్గొందగాను,
విరియుచుంటిని నేను వెండివెన్నెలను.
అందరకు నా అనురాగ సుధయె అర్పణంబాయె.
ఆదిత్యుడు నా అంతరంగాన ఆత్మయై అలరె.
ఆత్మదర్శనానందమగ్నుండనై అట్లెయుంటి.
శశి సూర్యకళలలోనే, శోభిల్లుచుంటి.
అనురాగసుధయు, ఆత్మజ్ఙానజ్యోతియు
సోమసూర్యుల సౌరులై నరునుద్ధరించు.
రవి శశికళల రంజిల్లు నరుడె నారాయణుండు.........✍ *మాస్టర్ ఇ.కె.* 🌻